ఏపీ సీఎం చంద్రబాబు అలా మాట్లాడటం విడ్డూరం.. CPI కూనంనేని కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
ఏపీ సీఎం చంద్రబాబు అలా మాట్లాడటం విడ్డూరం.. CPI కూనంనేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికీ జరగడం లేదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva) అన్నారు. టెక్నీకల్ సమస్యలు ఉన్నాయని అంటున్నారు.. వాటిని పరిష్కరించి రుణమాఫీ అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమి కొత్తగా లేదని అభిప్రాయపడ్డారు. విద్యా రంగానికి 14 శాతం నిధులు కేటాయించాలని అడిగాము.. కానీ 8 శాతం మాత్రమే కేటాయించారని అన్నారు. నిధుల కొరత ఉందని కొన్ని రంగాలకే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని సాకులు చెప్పడం కాకుండా.. ఉన్న బడ్జెట్‌ను ఎలా వినియోగించాలనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని, ఎక్కువ హామీలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

గతం కంటే సజావుగా అసెంబ్లీ జరిగిందని కూనంనేని అన్నారు. గత (BRS) బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కంటే సజావుగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. అందరికీ మాట్లాడే అవకాశం లభించిందని, గతంలో మాట్లాడే వారిని మార్షల్స్‌తో బయటకు పంపించే వారని విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. అందరికీ అవకాశం ఇస్తున్నారని చెప్పారు. తాను టూరిజం డెవలప్మెంట్ చేయాలని చేసిన మాటలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వక్రీకరించారని ఆరోపించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం వల్ల టూరిజం ద్వారా నిధులు సమకూరుతాయని తాను చెప్పానని అన్నారు. కానీ చంద్రబాబు (CM Chandrababu) ఏ ఇజం లేదు.. టూరిజం మాత్రమే ఉందని 30 ఏళ్ల క్రితం చెప్పానని.. ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఒప్పుకున్నారని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని అన్నారు.

Next Story

Most Viewed