- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాని ‘ది ప్యారడైజ్’ మూవీలో టాలీవుడ్ హీరో కీ రోల్.. హైప్ పెంచుతున్న న్యూస్!

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (nani) సోలోగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘అష్టాచమ్మా’( Ashta Chamma)సినిమాతో వచ్చి అందరినీ మెస్మరైజ్ చేశారు. ఆ తర్వాత ఎన్నో హిట్ మూవీస్ చేసి నేచురల్ స్టార్‌గా మారిపోయాడు. గత ఏడాది నాని ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)సినిమాతో వచ్చి ఘన విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ఓ రెండు భారీ ప్రాజెక్ట్స్‌తో రాబోతున్నారు. నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ ది ప్యారడైజ్(The Paradise), హిట్-3. అయితే ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’ చిత్రం ‘దసరా’ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. మరీ ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరిలో భారీ అంచనాలను పెంచడంతో పాటు నాని లుక్ ఆకర్శించింది. అయితే ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ వంటి భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్స్‌లోకి రానుంది. దీంతో గత కొద్ది రోజుల నుంచి ‘ది ప్యారడైజ్’చిత్రానికి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాని విడుదల చేసిన కౌంట్‌డౌన్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో హైప్ పెంచింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆ చిత్రంలో నాని ఫ్రెండ్‌గా టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించబోతున్నట్లు టాక్. దసరా సినిమాలో దీక్షిత్ శెట్టిని తీసుకున్నట్లుగానే.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ శర్వానంద్‌ను తీసుకోవాలని ఆ పాత్రకు ఆయన కరెక్ట్‌గా సెట్ అవుతారని శ్రీకాంత్ ఓదెల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శర్వాకు ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా చెప్పడంతో ఆయన ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఒకవేళ అదే కనుక జరిగితే హిట్ అవడం ఖాయమని అంటున్నారు. ఇక ‘ది ప్యారడైజ్’ కోసం శ్రీకాంత్ ఓదెల కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ‘దసరా’ కంటే ఇంకా పెద్ద హిట్‌ను నానికి ఇవ్వాలని అనుకుంటున్నారట.