కౌలు రైతుల కోసం కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకురావాలి : ఎంపీ లావు

by Rani Yarlagadda |
కౌలు రైతుల కోసం కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకురావాలి : ఎంపీ లావు
X

దిశ, వెబ్ డెస్క్: కౌలు రైతుల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టబోతున్నానని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (MP Lavu Srikrishna Devarayalu) నేడు లోక్ సభ (Lok Sabha) జీరో అవర్లో (Zero Hour) ప్రకటించారు. ఆ సమయంలో కౌలు రైతుల అంశాన్ని ప్రస్తావించిన ఆయన.. ఆచార్య ఎన్జీ రంగా (Acharya NG Ranga) 125వ జయంతి సందర్భంగా కౌలు రైతులకు న్యాయం చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఏపీలో కౌలు రైతుల డేటాను సేకరించామని, జాతీయ స్థాయిలో కౌలు రైతులకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం చట్టం తీసుకురావాలని కోరారు.

రాష్ట్రంలో కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడంతో వారికి కిసాన్ సమ్మాన్ నిధి అందడం లేదన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 9 కోట్ల మంది రైతులు ప్రతి ఏటా రూ.60 వేల కోట్లను పొందుతున్నట్లు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వివరించారు. కౌలు రైతుల కోసం ఏపీ ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు కూడా చేరేలా జాతీయస్థాయిలో చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఎంపీ లావు.. లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కేంద్రప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు న్యాయం చేస్తే.. ఆచార్య ఎన్జీ రంగాకు మనం ఘనమైన నివాళి ఇచ్చినట్లేనని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed