- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్.. రూ.10,300 కోట్లు కేటాయింపు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు కేంద్రం మరో భారీ శుభవార్త చెప్పింది. విశాఖ స్టీల్‌ప్లాంట్(Visakha Steel Plant)కు రివైవల్ ప్యాకేజీ ప్రకటించింది. రూ.10,300 కోట్లు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటనపై కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), ఎన్డీఏ ప్రభుత్వానికి(NDA Govt) కృతజ్ఞతలు చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఎన్డీఏ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు. కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోడీ వచ్చినప్పుడు స్టీల్‌ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కోరిన విషయం తెలిసిందే.
అంతేకాదు.. ఈనెల మొదటి వారంలో ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy)ని సైతం స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును తక్షణమే ఆదుకోవాలని, రుణాలన్నీ తీర్చేసి, ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపడానికి సాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని ఇప్పటికే కుమారస్వామి కూడా వెల్లడించారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) సైతం కుమారస్వామితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కు రివైవల్ ప్యాకేజీ ప్రకటించింది.