AP News:ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరానికి నిధులు విడుదల చేసిన కేంద్రం

by Jakkula Mamatha |   ( Updated:2024-10-08 15:16:02.0  )
AP News:ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరానికి నిధులు విడుదల చేసిన కేంద్రం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీకి కేంద్ర ప్రభుత్వం(Central Govt) గుడ్ న్యూస్ చెప్పింది. అయితే నిన్న(సోమవారం) సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. పోలవరం నిర్మాణానికి(Construction of Polavaram) సంబంధించి తాజాగా కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల చేసింది. అందులో రూ.800 కోట్లు పోలవరం రీయింబర్స్‌మెంట్(Polavaram Reimbursement) కింద, రూ.2,000 కోట్లు అడ్వాన్స్ కింద చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెల క్రితం రూ.30,436 కోట్లతో రెండో డీ‌పీఆర్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆ మేరకు రూ. 2,800 కోట్లను తాజాగా విడుదల చేసింది.

దీంతో ఏపీ ప్రభుత్వం(AP Govt) హర్షం వ్యక్తం చేసింది. మొదటి డీపీఆర్ కంటే రూ. 12,157 కోట్లు అదనంగా రెండవ డీపీఆర్ ఆమోదం పొందటంతో ఆ నిధులను రెండేళ్లలో ఇవ్వనున్నట్టు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది. ఆ మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 6వేల కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 6,157 కోట్లు ఇస్తామన్న కేంద్రం తాజాగా రూ. 2,800 కోట్లను విడుదల చేసింది. నిన్న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఈ ప్రకటన రావడంతో ఆయన కృషి వల్లే పోలవరం నిధులు విడుదలయ్యాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed