- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaravati: ఏపీపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి కేంద్రం పెద్దలు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్నికలకు సై అంటున్నాయి. ముందస్తు ఎన్నికలకు సైతం సిద్ధం అంటూ ప్రకటించేస్తున్నాయి. ఇక జూన్ రెండోవారంలో పవన్ కల్యాణ్ సైతం వారాహి యాత్రను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాము కూడా ఎన్నికలకు సై అంటుంది బీజేపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్తోంది. బీజేపీ వైసీపీని ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు మాత్రం వాటిని అంతగా పట్టించుకోవడం లేదు. బీజేపీ, వైసీపీ ఒక్కటేనని అంటున్నారు. ఇది పార్టీకి చేటు తెస్తుందని బీజేపీ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలా ప్రజల్లోకి వెళ్లాలనేదానిపై బీజేపీ తలమునకలవుతుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈనెలలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఏపీకి పంపిస్తున్నట్లు వెల్లడించింది.
అమిత్ షా రాక
ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతోనే వెళ్లాలని నిర్ణయించింది. అయితే టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్నికలకు రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయాలు ఉంటాయని బీజేపీ అధిష్టానం దాటవేస్తూ వస్తోంది. ఎన్నికలకు టైం దగ్గరకొస్తున్న తరుణంలో పొత్తులపై క్లారిటీ లేకపోవడం అటు టీడీపీ, ఇటు జనసేన మరోవైపు బీజేపీలలో ఆందోళన నెలకొంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ఖరారు కావడం చర్చనీయాశంగా మారింది. ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో టీడీపీతో పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లాలా వాద్దా అనేదానిపై అమిత్ షా నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది.
ఈనెల 10న జేపీ నడ్డా
మరోవైపు ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తిరుపతికి రానున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు బీజేపీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ రెండు రోజుల వ్యవధిలో ఏపీలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. వీరి పర్యటన రాష్ట్రంలో రాజకీయ పరిణమాలపై అంచనా వేయడంతోపాటు టీడీపీతో పొత్తులపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి పర్యటన అనంతరం 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా లేక టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయా? జనసేన-బీజేపీ మాత్రమే పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తాయా అనేదానిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Also Read..