తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

by Gantepaka Srikanth |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
X

దిశ, తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనార్థం సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్యం సమయంలో అధికారులు వీరికి దర్శన అవకాశం కల్పించారు. వీరిలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, సినీ నటి శ్రీముఖి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెలించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Next Story