అంబరాన్నంటిన భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు

by Indraja |
అంబరాన్నంటిన భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు
X

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు నుండి సంక్రాంతి సంబరాలు మొదలైయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు భోగి వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. వేకువ జామున భగ్గు మన్నభోగి మంటల చుటూ చేరి ఆడిపాడి ప్రజలు ఆనంద లోకంలో విహరించారు. సాధారణ ప్రజలు నుండి ప్రముఖుల వరకు భోగి వేడుకల్లో ఉత్సహంగా పాల్గొన్నారు. ఇక భోగి వేడులకల్లో పాల్గొన్న ప్రముఖుల విషయానికి వస్తే.. కృష్ణ రామచంద్రాపురం నియోజకవర్గంలో నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి సంప్రదాయాల సంరక్షిస్తున్నటువంటి పండుగ సంక్రాంతి అని.. ఇక మనసులోని మలినాలను కడిగేసుకోమని భోగి పండుగ సూచిస్తుందని.. ఇక దూర దూర ప్రాంతాలకు వెళ్లిన పుట్టిన ఊరిని, అయినవాళ్ళని మరిచిపోకుండా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కలుసుకోమని సంక్రాంతి చెప్తుందని అయన పేర్కొన్నారు. ఇక తిరుపతి లోని శ్రీ విద్యానికేతన్ లోనూ భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, అలానే ఆయన తనయుడు మంచు విష్ణు పాల్గొన్నారు. అలానే సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు ఆడిపాడారు.

Advertisement

Next Story