- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News: వైజాగ్ లో డ్రగ్స్ కలకలం.. సీబీఐ వర్సెస్ విశాఖ పోలీసులు..
దిశ వెబ్ డెస్క్: 50వేల కోట్ల రూపాయలు విలువచేసే డ్రగ్స్ విశాఖ సాగర తీరాన పట్టుబడంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఆ డ్రగ్స్ దందా వెనక ఎవరెవరి హస్తాలు ఉన్నాయో వెలికితీసేందుకు సీబీఐ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐకి, విశాఖ పోలీసులకు మధ్య మాటల వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ విశాఖ పోలీసుల వల్లే సోదాలు ఆలస్యమైయ్యాయని సీబీఐ పేర్కొంది.
అదే విషయాన్నీ FIR లో నమోదు సీబీఐ చేసింది. దీనితో సీబీఐపై విశాఖ సీపీ రవిశంకర్ ఫైర్ అయ్యారు. తమ కారణంగానే సోదాలు ఆలస్యమైయ్యాయని అనడం సరికాదు అని మండిపడ్డారు. కంటైనర్ టర్మినల్ తమ కమిషనేట్ పరిధిలోకి రాదు అని ఆయన పేరొన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే తాము వెళ్ళామని తెలిపారు. ఇక సీబీఐ కేవలం డాగ్ స్క్వాడ్ ను మాత్రమే అడిగిందని.. తాము సీబీఐ అడిగిన డాగ్ స్క్వాడ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం డ్రగ్స్ కేసు విషయంలో విశాఖ పోలీసులు సీబీఐకి సహకరించడంలేదు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఇక సీబీఐ తమ రికార్డ్స్ లో వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కి సంబంధిచి అలా రాసుకుందని.. కావాలంటే సీబీఐ అధికారులకు కాల్ చేసి కన్నుకోమన్నారు. అలానే తమపై ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదని స్పష్టం చేశారు. అలానే తాము విశాఖలో డ్రగ్స్ దందాపై ఉక్కు పదం మోతున్నామన్నారు.