- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెజవాడలో కార్ రేసింగ్.. నలుగురికి తీవ్ర గాయాలు
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడలో కార్ రేసింగ్ కలకలం రేపింది. నగరంలోని జాతీయ రహదారిపై గురునానక్ కాలనీ సమీపంలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్‌లో శనివారం అర్ధరాత్రి కార్ల రేసింగ్ జరిగింది. బెంజ్, ఫార్చ్యూనర్ కార్లతో యువతీ, యువకులు రేస్ నిర్వహించారు. ఈ క్రమంలో రామవరప్పాడు వైపు వెళ్తున్న 2 స్కూటీలను పోటీలో ఉన్న ఓ ఫార్చూనర్ కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. దీంతో ఆ నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు తీవ్ర గాయాలైన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న యువతీ యువకుడు బెంజ్ కారులో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన స్కూటీలు రెండు ముక్కలైపోయాయి. కాగా కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు
ఇకపోతే బెజవాడలో కార్ రేసింగ్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలో రేసింగ్ నిర్వహిస్తున్న నలుగురు యువతులు, యువకులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరు ఈ రేసింగ్‌లో పాల్గొన్నారు అనేదానిపై ఆరా తీస్తున్నారు.