Tammileru River:పరవళ్లు తొక్కుతున్న తమ్మిలేరు

by Jakkula Mamatha |
Tammileru River:పరవళ్లు తొక్కుతున్న తమ్మిలేరు
X

దిశ, ఏలూరు:ఏలూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది. కొండ వాగుల పై ఉన్న నాలుగు రిజర్వాయర్‌లు పూర్తి సామర్ధ్యంతో కళతళలాడుతున్నాయి. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు ఉరవడికి ఆస్తి నష్టం సంభవించింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నాలుగో రోజు కూడా వర్షం కురవడంతో జల్లేరు, ఎర్రకాలువ, కొవ్వాడ, తమ్మిలేరు రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం వద్ద తమ్మిలేరు రిజర్వాయర్ సామర్థ్యం 355 అడుగులు. కాగా ప్రస్తుతం నీటిమట్టం 342.83 అడుగులు ఉంది. రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నూజివీడు నియోజకవర్గంలో కురిసిన వర్షపు నీరు తమ్మిలేరు ఓ కలుస్తుంది. పై నుంచి 1200 క్యూసెక్కుల నీరు కూడా విడుదల కావడంతో ఏలూరు నగరం వద్ద వరద నీటి మట్టం పెరుగుతుంది.

తమ్మిలేరు వరదను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా పడమర సాకులు మీదకు రావడంతో వన్ టౌన్ సిఐ ఎన్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రజలను పంపేశారు. పడమర లాకుల వద్ద పేరుకుపోయిన ప్రవాహానికి ఆటంకం కలిగించే తూడను పొక్లెయిన్ ఉపయోగించి తొలగించారు. శనువారపుపేట కాజ్వే, నీటమునిగిన పోవడంతో ఆ రహదారి మూసివేశారు. పళ్లు ప్రాంతాలను వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, తదితర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఏలూరు ఆర్‌డీఓ ఖాజావలి పడమర తమ్మిలేరు వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు.

ఏజెన్సీ ప్రాంతంలో..

బుట్టాయగూడెం మండలం అలివేలు వద్ద గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 217.80 మీటర్లు కాగా ప్రస్తుతం జల్లేరు వాగు వద్ద నీటి మట్టం 215.5 మీటర్లు ఉంది. జల్లేరు ప్రాజెక్టులోకి ప్రస్తుతం 278 క్యూసెక్కుల వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇందులో 231 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగ వారి గూడెం వద్ద గల కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 83.5 మీటర్లు కాగా శనివారం నాటికి ఇది 82.2 0 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 12,525 క్యూసెక్కుల నీరు దిగు విడుదల చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed