APSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్.. బస్సు ఛార్జీలు భారీగా పెంపు!

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-13 07:26:43.0  )
APSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్..  బస్సు ఛార్జీలు భారీగా పెంపు!
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలపై భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు కూడా సర్కార్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. నెలకు రూ.వెయ్యి కోట్ల అదరపు భారాన్ని మోయాల్సి వస్తుంది. దీంతో భారీన్ని తగ్గించుకోవడానికి ఛార్జీల పెంచాలని APSRTC నిర్ణయించింది.

Advertisement

Next Story