- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Buddha Venkanna: వెంకన్న అనుగ్రహిస్తేనే.. తిరుమలకు వెళ్తారు: జగన్‌పై బుద్దా వెంకన్న సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: వెంకన్న అనుగ్రహిస్తేనే.. ఎవరైనా తిరుమలకు వెళ్తారంటూ మాజీ సీఎం జగన్ (Former CM Jagan)పై టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సెటైర్లు వేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని వైసీపీ (YCP) అధినేత, ఆ పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తిరుమల వెంకన్న సాక్షిగా జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. వెంకన్న అనుగ్రహిస్తేనే ఎవరైనా తిరుమలకు వెళ్తారని.. ఆయన అనుమతి లేదు కాబట్టే జగన్ అక్కడికి వెళ్లలేకపోయారని కామెంట్ చేశారు. ఇంట్లో బైబిల్ (Bible) చదివే జగన్.. తిరుమల వేంకటేశుడిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. టీటీడీ నిబంధనల మేరకే తాము డిక్లరేషన్ అడిగామని స్పష్టం చేశారు. ఇన్ని తప్పులు చేసి మళ్లీ ప్రభుత్వంపై వైసీపీ నాయకులు మాటల యుద్ధానికి దిగుతున్నారని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.