- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో ఇంకా తగ్గని కేసీఆర్ క్రేజ్.. విజయవాడ సెంట్రల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ క్రేజ్ ఇంకా తగ్గలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా ఏపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన కొణిజేటి ఆదినారాయణ బీఆర్ఎస్ నేత. ఆయన బీఆర్ఎస్ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే బీఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రంలో కనిపించని పరిస్థితి నెలకొంది. బీఫామ్ కోసం ఆదినారాయణ శత విధాలుగా ప్రయత్నం చేశారు.
అయితే తోట చంద్రశేఖర్ అందుబాటులో లేకపోవడంతో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ చేతులు మీదగా బీఫామ్ తీసుకోవాలని భావిస్తున్నారు. కేసీఆర్ బీఫామ్ ఇవ్వకపోతే కనీసం స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. బీఆర్ఎస్ తరపున తన పోటీని కేసీఆర్ అంగీకరిస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో విజయవాడ సెంట్రల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని కొణిజేటి ఆదినారాయణ తెలిపారు.