క్రైస్తవులకు బ్రదర్ అనిల్ సంచలన పిలుపు

by srinivas |   ( Updated:2024-04-28 12:42:14.0  )
క్రైస్తవులకు బ్రదర్ అనిల్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: పాపాలు చేసిన వారికి ఓటు వేయొద్దని క్రైస్తవులకు బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. కడప కృపా చర్చిలో క్రైస్తవులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలన రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి శాపంగా మారిందని మండిపడ్డారు. జగన్‌లో ఓడిపోతామనే నైరాశ్యం కనిపిస్తోందని, అందుకే ముందుగానే చేతులెత్తేశారని బ్రదర్ అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. దేవుడిపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో ఓటు వేయండని సూచించారు. న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఎవరకీ భయపడొద్దని.. ఏసు ప్రభు అండగా ఉంటారని తెలిపారు. పాపులను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రార్థన చేస్తే సరిపోదన్నారు. పాపాలు చేసే వారిని తొక్కిపడేయాలని క్రైస్తవ సోదరులకు బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story