Brwaking News: టీడీపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్.. ఏమన్నారంటే!

by Shiva |   ( Updated:2024-02-26 08:32:49.0  )
Brwaking News: టీడీపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్.. ఏమన్నారంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేనతో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు అంశం టీడీపీలో కాకరేపుతోంది. ఈ మేరకు పలువురు నాయకులు తమకు సీట్లు దక్కకపోవడంతో పార్టీపై బహిరంగంగానే నిరసనలు తెలుపుతూ.. దుమ్మెత్తిపోస్తున్నారు. మరికొందరు అధికార వైసీపీలోకి జంప్ అవుతూ.. తమ భవిష్యత్తు కాపాడుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అన్ని స్థానాల విషయం అటుంచింతే ప్రస్తుతం మైలవరం సెగ్మెంట్‌లో పరిస్థితి విచిత్రంగా మారింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టీడీపీలో చేరేందుకు సన్నద్ధమతున్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

బాబు ఆదేశాల మేరకు.. మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని తెలిపారు. అదేవిధంగా అక్కడ దేవినేని ఉమాతో తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కేవలం చంద్రబాబుతో సాధ్యమని అన్నారు. ఈ పరిణామంతో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇన్నాళ్లు చంద్రబాబునే నమ్ముకున్న దేవినేని ఉమకు బాబు కేటాయిస్తారా.. లేక వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌ను మైలవరంలో పోటీలోకి దింపుతారా.. అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

Read More..

నన్ను కాదని వాడికి టికెట్ ఇచ్చేదేంది రా బై.. పెట్రోల్ డబ్బాతో నిరసన

Advertisement

Next Story