- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING : చంద్రబాబు స్కిల్ కేసులో ఊహించని ట్విస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: స్కిల్ స్కామ్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం పెట్టిన కేసు విషయంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పరస్పరంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అయింది. అవినితి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ తన తీర్పులో పేర్కొనగా, అదే బెంచ్‌లో ఉన్న జస్టిస్ బెలా త్రివేది వర్తించదు అంటూ తీర్పు నిచ్చారు. సెక్షన్ 17ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నయాని న్యాయమూర్తులు తెలిపారు.
దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామని పేర్కొన్నారు. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసు చెల్లదని దానిని కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లగా దీనిపై వాదనలు జరిగాయి. బాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే.. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం జనవరి 16 కు తీర్పు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ తీర్పు చదివి వినిపించిన ఇరువు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
బెంచ్ మార్క్ తీర్పు మరికాస్త లేట్
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎంక్వైరీ లేదా ఇంక్వైరీ లేదా విచారణ చేయడానికి ముందస్తు అనుమతి లేకుండా విచారణ చేయడానికి వీలు లేదు. చంద్రబాబు పై నమోదైన కేసు విషయంలోనూ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే చంద్రబాబు పిటిషన్ పై రాబోయే తీర్పు దేశంలోనే ఓ బెంచ్ మార్క్ తీర్పుగా మారే అవకాశం ఉండటంతో ఎలాంటి తీర్పు వస్తుందో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అయింది. అయితే ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, తగిన నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నామని జడ్జీలు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ పిటిషన్‌పై సీజేఐ బెంచ్ ఏర్పాటు చేయండతో పాటు వాదనలు విని తీర్పు వెలువరించడానికి మరికాస్త ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి.