BREAKING: కరెంట్ షాక్‌తో ఆగిన బాలుడి హార్ట్‌ బీట్.. సీపీఆర్‌ చేసి పునర్జన్మనిచ్చిన వైద్యురాలు (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-05-20 10:46:18.0  )
BREAKING: కరెంట్ షాక్‌తో ఆగిన బాలుడి హార్ట్‌ బీట్.. సీపీఆర్‌ చేసి పునర్జన్మనిచ్చిన వైద్యురాలు (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఆర్‌ చేసి ఓ వైద్యురాలు చాకచక్యంగా బాలుడి ప్రాణాలు కాపాడిన ఘటన విజయవాడ పట్టణంలోని అయ్యప్పనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం ఓ బాలుడు సరదాగా ఆడకుంటుండగా కరెంట్ పోల్ తగలడంతో షాక్‌ తగిలింది. దీంతో హార్ట్ బీట్ తగ్గి బాలుడు ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి బాలుడి పరిస్థితిని అబ్జర్వ్ చేసింది. అనంతరం వెంటనే సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలను కాపాడింది. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, కాలనీవాసులు వైద్యురాలు రవళిని అభినందించారు. సరైన సమయంలో చాకచక్యంగా బాలుడి కాపాడారంటూ.. ప్రశంసలతో ముంచెత్తారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story