BREAKING: పల్నాడు జల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ఉద్రిక్తత.. మాజీ మంత్రిపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి

by Shiva |   ( Updated:2024-01-29 02:12:17.0  )
BREAKING: పల్నాడు జల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ఉద్రిక్తత.. మాజీ మంత్రిపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ఓ వర్గం మారో వర్గం నాయకులపై దాడులకు తెగబడుతూ ఎన్నికల వేడిని రాజేస్తున్నారు. తాజాగా, ఇవాళ పల్నాడు జల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రాచారంలో కొందరు ఆగంతకులు ఇష్టానుసారంగా రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ సహా ఇతర నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన టీడీపీ శ్రేణులు తమపై వైసీపీ కార్యకర్తలే దాడి చేశారంటూ ఆరోపించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న డీఎస్పీ ఆదినారాయణ కన్నా లక్ష్మీనారాయణను ప్రచారాన్ని ఆపాలని కోరారు. దీంతో మండిపడిన కన్నా ఆయనపై ఫైర్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు అనే అయుధంతో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్భలంతోనే రాాళ్ల దాడి జరిగిందని ఆరోపించారు. గంజాయి తాగొచ్చి వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్ల దాడికి పాల్పడ్డారని తెలిపారు. వాళ్లు తమపై రాళ్లు వేసినా.. మనే వాళ్లపై రాళ్లు వేశామని కేసు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. పోలీసు వ్యవస్థకు సీఎంకు తొత్తుగా పని చేస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story