- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: అసెంబ్లీకి బయల్దేరిన టీడీపీ ఎమ్మెల్యేలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు బయల్దేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి 134 మంది సభ్యులు నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రానున్నారు. ఈ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు.
అనంతరం బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం కొంతసేపు సమావేశాలను వాయిదా వేయనున్నారు. బీఏసీ మీటింగ్‌కు అన్ని పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని అధికార పార్టీ నేతలు ఆహ్వానించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చించనున్నారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను కోరనున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులపై అధికార పార్టీని ఇరుకున్న పెట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తుండగా .. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పార్టీ సభ్యులు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న సమావేశాలపై రెండు పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరికాసేపట్లో ఏం జరుగుతుందో చూద్దాం.