BREAKING: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. నేడు చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కనున్న రఘురామకృష్ణరాజు

by Shiva |   ( Updated:2024-04-05 06:27:31.0  )
BREAKING: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. నేడు చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కనున్న రఘురామకృష్ణరాజు
X

దిశ, వెబ్‌డెస్క్: తాను ఏ పార్టీలో చేరినా.. వెంటనే తన ఎంపీ సీటు పోతుందంటూ నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి బాంబు పేల్చారు. భీమవరంలోని కూటమి క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తనను ఇనాళ్లు చాలాబాగా వాడుకున్నారని.. ఇప్పుడు పార్టీ సభ్యత్వం ఇవ్వమంటే ఇవ్వడం లేదంటూ పరోక్షంగా ఆయన టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబే సీఎం కావాలంటూ తాను ప్రగాఢంగా కోరుకుంటున్నానని వెల్లడించారు. ఒక వేళ టీడీపీ నుంచి టికెట్ వస్తే.. తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఇవాళ ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మరికొద్దిసేపట్లో భీమవరం నుంచి నల్లజర్ల బయల్దేరి అధినేతతో భేటీ కాబోతున్నట్లుగా సమాచారం. కాగా, ప్రస్తుతం నర్సాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. అయితే, పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఆ స్థానంలో శ్రీనివాస వర్మ పోటీలో ఉండబోతున్నట్లుగా కమలం పార్టీ ప్రకటించింది. చివరికి చేసేదేమి లేక అసెంబ్లీ బరిలో రఘురామను నిలిపేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

Next Story