- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రొయ్యకు మీసం.. చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయి: భీమవరం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తన మీద కోపంతో ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు విపరీతంగా బీపీ పెరుగుతోందని సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భీమవరంలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో ఆయన మాట్లాడుతూ.. మంచి చేసిన మనతో.. జెండాలు జతకట్టిన విపక్షాలతో తలపడబోతున్నామని అన్నారు. రాబోయే ఎన్నికలు ప్రజల తలరాతను మార్చే ఎన్నికలని అన్నారు. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో జగన్‌ది ముమ్మాటికి పేదల పక్షమని అన్నారు. పొరపాటున కూటమికి ఓటేస్తే.. పథకాలన్నీ ముగిసిపోతాయని అన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నడంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఆయనకు తనపై కోపం పెరుగుతోందని, శాపనార్థాలు పెడుతున్నారని పేర్కొన్నారు. తన మీద రాళ్లు వేసి అంతం చేయండి అంటూ రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. ఆయన పేరు చెబితేనే గుర్తొచ్చేది వెన్నుపోటు, మోసం, కుట్రలు అని అన్నారు. దత్తపుత్రుడు ఎన్నికల్లో విజయం సాధించలేక ఇప్పుడు నియోజకవర్గాలను మారుస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి కోసం ఎన్నడూ ఉపయోగించ లేదని తెలిపారు. కేవలం పొత్తులు, మోసాలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. పాదర్శకంగా ఎవరికీ లంచాలనే మాట లేకుండా 2.70 లక్షల కోట్లను మహిళల ఖాతాల్లో వేశామని తెలిపారు. రోయ్యకు మీసం.. చంద్రబాబుకు మోసం పుట్టుకతో వచ్చియంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏనాడు ఒంటరి కాదని.. తోడుగా పేదల సైన్యమే ఉందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని సీఎం జగన్ తేల్చి చెప్పారు.
Read More : పవన్ కల్యాణ్ భార్యలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన CM జగన్