- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking:వైసీపీకి మరో షాక్..పార్టీ వీడిన రామకృష్ణ యాదవ్
దిశ ప్రతినిధి,తిరుపతి:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది.తిరుపతి లో బలమైన అన్న ఫ్యామిలీ మొత్తం వైసీపీ పార్టీకి దూరమైంది. అధిక ఓటు సాంద్రత కలిగిన జీవకోన ప్రాంతంలో మంచి పట్టు ఉన్న అన్నా రామచంద్రయ్య యాదవ్ ఇటీవల పార్టీకి రాజీనామా ప్రకటించారు.అనంతరం ఆయన కుమార్తెలు 48, 49 కార్పొరేటర్లైన సంధ్య యాదవ్ అనిత యాదవ్ ఇద్దరు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రామచంద్రయ్య యాదవ్ అన్న యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న రామకృష్ణ యాదవ్ సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటించారు. ఆయన భార్య రాజీవ్ నగర్ మాజీ సర్పంచ్ అన్న మల్లీశ్వరి కూడా పార్టీకి రాజీనామా ప్రకటించారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన ఫ్యామిలీ పై కక్ష కట్టి తమను అనగా తొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తిరుపతి చుట్టుపక్కల భూకబ్జాలు అధిగమయ్యాయని, రౌడీయిజం పెరిగిపోయిందని గంజాయి మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువైందని వీటన్నిటికీ కారణం ఎమ్మెల్యే భూమన, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి లు కారణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆయన తనయుడు సభలు సమావేశాల్లో శ్రీరంగనీతులు చెబుతారు కానీ వాస్తవంగా అందుకు విరుద్ధంగా వారు తిరుపతి నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము ఏ పార్టీలో చేరడం లేదని అయితే వైసీపీ అభ్యర్థి ని ఓడించడానికి తిరుపతిలో జనసేన అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించారు.