BREAKING: గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలకు తప్పిన పెను ప్రమాదం

by Shiva |   ( Updated:2024-01-30 07:12:13.0  )
BREAKING: గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలకు పెను ప్రమాదం తప్పింది. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) విభాగంలో ఇవాళ సమన్వయ లోపం తలెత్తింది. పొగమంచు కారణంగా షార్జా నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం, చెన్నై నుంచి వచ్చిన ఇండిగో విమానం ఒకే సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ ప్రెమిసిస్‌కు చేరుకున్నాయి. దీంతో, ఏ విమానం మొదటగా రన్‌వేపై దిగాలో ఏటీసీ నుంచి రెండు విమానాల పైలెట్లకు సమాచారం అందలేదు. ఇక చేసేదేమి లేక పైలెట్లు ఫ్లైట్లను కాసేపు గాలిలోనే చక్కర్లు కొట్టించారు. ఈ క్రమంలో ఎక్కడ రెండు విమానాలు ఢీకొంటాయని ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఏటీసీ ఒక విమానం తరువాత మరో విమానం ల్యాండింగ్‌కు సిగ్నల్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story