- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: చిత్తూరు జిల్లాలో పోలీసుల తనిఖీల్లో చిత్రం భళారే విచిత్రం.. పెళ్లి సారెను కూడా వదలని వైనం!
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు రోడ్లపై పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ చిత్తూరు జిల్లా యాదమరి బైపాస్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అయితే, బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్న పెళ్లి బృందం వెళ్తున్న వాహనాన్న ఆపి పూర్తిగా చెక్ చేశారు. అనంతరం వివాహం సందర్భంగా పెళ్లి కూతురికి తీసుకెళ్తున్న సారెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో సుమారు సారెలో ఉన్న 14 కిలోల వెండి వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. వివాహానికి వెళ్తున్నామని చెప్పినా.. తమ విడిచి పెట్టలేదని, పెళ్లి కూతురు సారెను కూడా సీజ్ చేయడం దుర్మార్గమని పెళ్లి బృందం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.