- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం
దిశ, వెబ్‌డెస్క్: రెండున్నర గంటలు సుధీర్ఘంగా కొనసాగిన ఏపీ కేబినెట్ భేటీ కాసేపటి క్రితం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశమైన ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు పంట బీమా పథకానికి ప్రీమియం చెల్లింపులపై మార్గదర్శలను రూపొందించేందుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని కేబినెట్ నియమించింది. అందులో వ్యవసాయ మంత్రి అచ్చం నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉండనున్నారు.
ఇక రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొత్త ఇసుక విధానానికి ఓకే చెబుతూ.. కొత్త ఇసుప పాలసీపై త్వరలో విధివిధానాలను రూపొందించనున్నారు. పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపారు. ఇక రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్‌సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి ఆమోదం ముద్ర వేశారు. రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారంటీకి సమ్మతం తెలిపారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.