- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. హిందూపురం ఎంపీ, అసెంబ్లీ బరిలో స్వామి పరిపూర్ణానంద
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద హిందూపురం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ తనను ఖరారు చేసినా.. చంద్రబాబు తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. కూటమిలో భాగంగా తమకు ఎక్కడ మైనారిటీ ఓట్లు పడవనే అనుమానంతోనే ఆ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార ప్రక్రియ మొదలుపెట్టామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు.
దక్షిణాదిలో హిందూపురం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతమని పరిపూర్ణానంద స్వామి అన్నారు. హిందూపురం అంటే.. హిందూ అని పేరులోనే ఉందని, అందుకే హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాని ప్రకటించారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. పొత్తులో భాగంగా తనకు టికెట్ రాకుండా చేశారంటూ పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, హిందూపూరం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నేత బీకే పార్థసారథి పోటీ చేయబోతున్నారు. ఇక అసెంబ్లీకి చంద్రబాబు బావమరిది, సినీనటుడు బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగబోతున్నారు.