BREAKING: సీఎం జగన్ దాడి ఘటనలో మరో కీలక పరిణామం.. విజయవాడ సీపీ క్రాంతి రాణా కీలక ప్రకటన

by Shiva |
BREAKING: సీఎం జగన్ దాడి ఘటనలో మరో కీలక పరిణామం.. విజయవాడ సీపీ క్రాంతి రాణా కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో శనివారం సీఎం జగన్ బస్సుయాత్ర నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయనపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రసంగిస్తున్న సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. ఈ క్రమంలోనే దాడిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పరిస్థితిని సమీక్షిస్తోంది. అదేవిధంగా ఘటన జరిగిన ప్రాంతం పరిధిలోని విజయవాడ సీపీ కాంతి రాణాకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు. జగన్‌ దాడి ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని.. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు. ఈ మేరకు విజయవాడ సీపీ క్రాంతి రాణా కీలక ప్రకటన చేశారు.

సీఎం జగన్ మీద దాడి ఘటనపై వెంటనే సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిందుతులను త్వరితగతిన పట్టుకునేందుకు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మేరకు ఘటన జరిగిన అజిత్‌సింగ్ నగర్ పీఎస్ పరిధిలో మూడు సెల్‌ఫోన్ టవర్ల నుంచి డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో 20 వేల సెల్‌ఫోన్లు యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed