- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: ఏనుగుల గుంపు దాడి.. వ్యక్తి మృతి
దిశ, వెబ్ డెస్క్: మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందారు. కొమరాడ మండలం వన్నాంకు చెందిన వాన శివనాయుడు అనే వ్యక్తి స్థానిక వాగులో స్నానం చేశారు. అనంతరం అరటి తోటలోకి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఏనుగులు ఒక్కసారిగా శివనాయుడుపై దాడి చేశాయి. విచక్షణారహితంగా తొండంతో కొడుతూ, కాలుతో తొక్కుతూ చంపేశాయి. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాయి. శివనాయుడు మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలంచారు. శివనాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అరటి తోటలోకి తరచూ ఏనుగులు వస్తున్నాయని, వాటిని గమనించకుండా వెళ్లి ఇప్పటికే చాలా మంది మృత్యువాత పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడు ఏనుగులు తమ ఊరిపై పడతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అరటి తోటలోకి ఏనుగులు రాకుండా అటవీ శాఖ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.