శ్రీశైల పుణ్యక్షేత్రానికి సంక్రాంతి శోభ.. కన్నుల పండువగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

by Shiva |
శ్రీశైల పుణ్యక్షేత్రానికి సంక్రాంతి శోభ.. కన్నుల పండువగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరిన దీవ్య క్షేత్రం శ్రీశైలంలో మకర సంక్రమణాన్ని సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ స్వామి వారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేయనున్నారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారు రావణ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం స్వామి అమ్మ వార్లకు శ్రీశైలం ఆలయ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు మకర సంక్రాంతి పర్వదినం రోజున నంది వాహన సేవ, స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం, 16న కైలాస వాహన సేవ, 17న యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోణ, 18న రాత్రి జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. అదేవిధంగా ఈనెల 18 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం, స్వామి, అమ్మవార్ల కల్యాణం, ఏకాంత సేవలను ఆలయ కమిటీ నిలిపివేశారు.

Advertisement

Next Story