Tirumala:భారీ వర్షాల ఎఫెక్ట్.. ఘాట్ రోడ్డులో జారిపడిన బండరాళ్లు

by Jakkula Mamatha |
Tirumala:భారీ వర్షాల ఎఫెక్ట్.. ఘాట్ రోడ్డులో జారిపడిన బండరాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక తిరుమల(Thirumala)లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఘాట్ రోడ్డులో కొండచరియలు(Landslides) విరిగిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్డులోని హరిణికి సమీపంలో జారిపడిన బండరాళ్లను సిబ్బంది తొలగించారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో జాగ్రత్తగా వాహనాలను నడపాలని టీటీడీ అధికారులు సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో పాపవినాశన, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహనాల రాకపోకలకు నిలిపివేసింది. పాపవినాశనం జలాశయం నీటి సామర్థ్యం పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లను అధికారులు ఎత్తి వేయనున్నారు. రెండు ఘాట్‌రోడ్లలో కొండ చరియలు(Landslides) విరిగిపడే అవకాశం ఉండటంతో ఇంజినీరింగ్ అధికారులను(Engineering Officers) అప్రమత్తం చేసింది. వర్షానికి కొండపై చలి తీవ్రత పెరగడంతో భక్తులు(Devotees) తీవ్ర అవస్థలు పడుతున్నారు. దర్శనానంతరం గదులకు వెళ్లే భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed