ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ

by M.Rajitha |
ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణకు కీలక పదవి కట్టబెట్టింది వైసీపీ. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణను ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా ప్రకటించారు జగన్. ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి అసెంబ్లీ అయినా, మండలి అయినా తనకు ఒకటే అని తెలిపిన బొత్స, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్నారు. మమ్మల్ని ఎదుర్కోవడానికి మహా అయితే కేసులు పెడతారని, అంతకంటే ఏం చేయలేరని, ప్రజల కోసం తాము ఎలాంటి కేసులయినా ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. అయితే బొత్స సత్యనారాయణను మండలిలో ప్రతిపక్ష నేతగా ప్రకటించిన కొద్దిసేపటికే మండలి ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఆళ్ళ అప్పిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తాను కడవరకు జగన్ తోనే ఉంటానని ప్రకటించారు అప్పిరెడ్డి.

Next Story

Most Viewed