IPOs: ఈ వారంలో 11 ఐపీఓలు.. 14 కంపెనీల లిస్టింగ్

by S Gopi |
IPOs: ఈ వారంలో 11 ఐపీఓలు.. 14 కంపెనీల లిస్టింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లలో చాలా రోజుల తర్వాత మరోసారి ఐపీఓల మొదలైంది. ఈ నెల 23వ తేదీ నుంచి వారం వ్యవధిలో ఏకంగా 11 కంపెనీలు ఐపీఓ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి వచ్చే వారం మార్కెట్ల నుంచి రూ.900 కోట్ల వరకు సమీకరించనున్నాయి. వాటిలో ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ మన్బా ఫైనాన్స్ రూ. 151 కోట్లను, వాల్వ్ సొల్యూషన్స్ మేకర్ ర్యాపిడ్ వాల్వ్స్(రూ. 30.41 కోట్లు), 3డీ ప్రింటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ వోల్ 3డీ ఇండియా(రూ. 25.56 కోట్లు), ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల టూలింగ్, కాంపోనెంట్‌లను తయారు చేసే టెక్ఎరా ఇంజినీరింగ్(రూ. 36 కోట్లు), పిగ్మెంట్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ యునిలెక్స్ కలర్స్ అండ్ కెమికల్స్(రూ. 31 కోట్లు), ఓటీటీలకు కంటెంట్ అందించే థింకింగ్ హ్యాట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సొల్యూషన్స్(రూ. 15.09 కోట్లు), రీసైకిల్ చేయబడిన పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ మరియు రీసైకిల్డ్ పెల్లెట్స్ మేకర్ దివ్యధన్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్(రూ. 24.2 కోట్లు), సహస్ర ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్స్(రూ. 186 కోట్లు), ఫోర్జ్ ఆటో ఇంటర్నేషనల్(రూ. 31 కోట్లు), సాజ్ హోటల్స్(రూ. 27.63 కోట్లు), కలానా ఇస్పాత్(రూ. 32.59 కోట్లు) సమీకరించనున్నాయి. లిస్టింగ్ కానున్న జాబితాలో వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్, పాపులర్ ఫౌండేషన్స్, డెక్కన్ ట్రాన్స్‌కాన్ లీజింగ్, ఎన్విరోటెక్ సిస్టమ్స్, పెలాట్రో, ఓసెల్ డివైసెస్, పారామౌంట్ స్పెషాలిటీ ఫోర్జింగ్స్ సహా ఇతర కంపెనీలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed