ప్రేమ.. రహస్య పెళ్లి.. ఆరు నెలలకే ఘోరం..!

by srinivas |   ( Updated:2025-03-16 16:49:58.0  )
ప్రేమ.. రహస్య పెళ్లి.. ఆరు నెలలకే ఘోరం..!
X

దిశ, వెబ్ డెస్క్: ‘ప్రేమ.. రహస్య పెళ్లి...’ సీన్ కట్ చేస్తే ఆరు నెలలకే ఘోరం జరిగింది. గుంటూరు చెందిన సాయి కుమార్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో వరంగల్‌కు చెందిన యువతి గీతిక పరిచయం అయింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. గత సెప్టెంబర్ 24న రహస్యంగా గుంటూరులో పెళ్లి చేసుకున్నారు. అయితే సాయికుమార్ మద్యం, గంజాయి బానిసయ్యాడు. నెల రోజులుగా గీతికను వేధిస్తున్నారు. ఈ విషయాన్ని గీతిక ఫోన్‌లో చెప్పడంతో వరంగల్‌కు రావాలని తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఫోన్ పెట్టేసిన అరగంటకు వాళ్లకు సాయికుమార్ తండ్రి ఫోన్ చేశారు. గీతిక చనిపోయిందని చెప్పారు. దీంతో గీతిక తల్లిదండ్రులు గుంటూరులో సాయికుమార్ ఇంటి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. గత కుమార్తెను సాయికుమార్ చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె శరీరంపై గాయాలున్నాయని, నిందితుడు సాయికుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే సాయి కుమార్ నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Next Story

Most Viewed