ఈత నేర్చుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు..

by Aamani |
ఈత నేర్చుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు..
X

దిశ,పరిగి : వికారాబాద్ జిల్లా దోమ మండలం గోగ్యానాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దోమ మండలం బుద్లాపూర్ అనుబంధ గ్రామమైన గొంగ్యానాయక్ తండా కు చెందిన నేనావత్ శంకర్- కవిత దంపతులకు నేనావత్ బాలాజీ (13) కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్నాడు. బాలాజీ మరో ఏడుగురు తన స్నేహితులు ఆదివారం మధ్యాహ్నం కాకర్వేని చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో ఈత నేర్చుకునేందుకు వెళ్లి నీటిలో మునిగాడు. ఇది గమనించిన తన స్నేహితులు చెరువులో వెతికారు.

ఆచూకీ లభించక పోవడం తో భయం పారిపోయారు. సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు తన స్నేహితులను ప్రశ్నించారు. తమకు తెలియదు అని చెప్పారు. తెలిసిన వ్యక్తులు, సన్నిహితుల వద్ద వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్నేహితులను విచారించగా నిన్న అందరూ కలిసి ఈతకు వెళ్ళాం, ఆ తర్వాత చెరువులో కనబడలేదని పోలీసులకు తెలిపారు. రాత్రి కావడంతో చెరువులో గుంతలు ఉండడంతో చెరువు వద్దకు వెళ్లి తిరిగి వచ్చారు. పోలీసులు, కుటుంబీకులు సోమవారం చెరువు వద్ద వెళ్లి చూసే సరికి బాలాజీ చెరువులో శవమై కనిపించాడు. ఇది చూసిన కుటుంబీకులు బోరున విలపించారు. బాలాజీ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు.

Next Story

Most Viewed