- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
by Naveena |

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ముదిరాజ్ సంఘం పెద్దలు ఆదివారం భూమి పూజ చేశారు. వేద పండితులు వేదాంతం గోపికృష్ణ శర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య గణపతి, గౌరీ, అమ్మవారి పూజ చేసి అమ్మవారి ప్రతిష్టాపన చేశారు. ముదిరాజ్ సంఘం మహిళలు మంగళ హారతులతో విచ్చేసి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్ గాజం మచ్చందర్, పెద్ద బజార్ సంగం అధ్యక్షులు బొండ్ల సంతోష్, రాజారాం నగర్ సంఘం అధ్యక్షులు ఈర్ల రవి, చైర్మన్ బోన సుమన్, జక్కం ప్రసాద్, కుల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story