- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Borugadda Anil: పోలీస్‌స్టేషన్‌లో బోరుగడ్డకు రాచమర్యాదలు
దిశ, వెబ్‌డెస్క్: బోరుగడ్డ అనిల్‌కు పోలీసులు రాచ మర్యాదలు చేస్తున్నారు. విచారణ కోసం అరండల్ పేట పీఎస్‌కు తరలించగా.. అక్కడి పోలీసులు.. స్టేషన్‌లోనే పరుపులు వేసి ఆయనకు పడుకోబెట్టారు. దీనికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్‌ని పోలీసులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు కూర్చోవడానికి ఏకంగా రైటర్ సీట్‌ని కేటాయించడం, పోలీస్ సిబ్బంది దగ్గరుండి అన్నం వడ్డించడం, పడుకోవడానికి ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ సమకూర్చిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై పెద్ద దుమారం రేగులోంది.
One more case filed on Borugadda Anil for abusing @naralokesh and @ncbn
— V@ndeM@t@r@m (@patriotatwork99) November 9, 2024
But wait ...
పోలీస్ స్టేషన్ లోనే బోరుగడ్డకు బెడ్డు, పరుపు మరియు దుప్పట్లు అందించిన పోలీసులు along with biriyani packetspic.twitter.com/hp6GSiIBty
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం గుంటూరు పోలీసులు బోరుగడ్డను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి తిరుగు ప్రయాణంలో గన్నవరం వద్ద ఓ రెస్టారెంట్‌లోకి భోజనానికి తీసుకెళ్లారు. హోటల్లో బిర్యానీ పెట్టించేందుకు ఖాకీలు రెడీకాగా.. అక్కడి కొందరు యువకులు.. దాన్ని వీడియో తీశారు. అది గమనించిన పోలీసులు వీడియోలు డిలీట్ చేసినా.. అప్పటికే ఆ వీడియోలు బయటకు వెళ్లడంతో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిపై అనేకమంది తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి టైంలో తాజాగా ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే రాచమర్యాదలు చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
AP Police VIP treatment for Borugadda Anil 😡
— Karl Marx2.O (@Marx2PointO) November 6, 2024
While being transferred to Rajahmundry Central Jail, Anil was treated to a feast at a restaurant in Gannavaram.
Following this, Guntur District SP Satish suspended the seven policemen involved.@geetha_happy2 do respond this… pic.twitter.com/K8x9jBwdRJ