- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Jac Amaravati చైర్మన్‌గా బొప్పరాజు ఏకగ్రీవం
- 21 మందితో రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ జేఏసీ అమరావతి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ) అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు రెవెన్యూ భవన్‌లో జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా 21 మంది కార్యవర్గ సభ్యులు ఆయా పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్‌గా, సెక్రటరీ జనరల్‌గా పలిశెట్టి దామోదర్ రావుతోపాటు మొత్తం 21 రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారి కె.భావనా ఋషి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి కృష్ణారావులు వ్యవహరించారు. ఏకగ్రీవంగా తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులకు బొప్పరాజు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల పక్షాన.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తానని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.