Tirumala: అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

by Rani Yarlagadda |   ( Updated:2024-11-06 14:28:56.0  )
Tirumala: అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక బొల్లినేని రాజగోపాల్ నాయుడు (TTD Chairman BR Naidu) తొలిసారిగా అధికారులు, టీటీడీ నూతన పాలకమండలి సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తిరుమలలో శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే అన్యమత ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి ట్రస్ట్ (Srivani Trust) నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, లెక్కలు తేలాక అవకతవకలుంటే.. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టీటీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ నాయుడికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈఓ శ్యామలారావు ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేయించారు. తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్యులకు కూడా వేదాశీర్వరచనాలు అందజేసి.. శ్రీవారి చిత్రపటం, డైరీలు, క్యాలెండర్లను అందించారు. కాగా.. బీఆర్ నాయుడు టీటీడీ 54వ ధర్మకర్త మండలి ఛైర్మన్.

Advertisement

Next Story

Most Viewed