- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhanu Prakash Reddy: వాళ్లకు జైలు తప్పదు.. ఐఏఎస్ ఆఫీసర్లపై సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: వైసీపీకి అనుకూలంగా వ్యవరిస్తున్న కొందరు అఖిల భారత అధికారులు జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజలకు అండగా నిలవాల్సిన కొందరు పోలీసులు కూడా బాధ్యతలు మరిచి సీఎం జగన్ చెప్పినట్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థుల తరపున వార్డు వలంటీర్లు ప్రచారం చేయడాన్ని భానుప్రకాశ్ రెడ్డి తప్పు బట్టారు. దొంగ ఓట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని వ్యాఖ్యానించారు. మూడున్నళ్లలో ఏపీకి కేంద్రప్రభుత్వం చాలా నిధులిచ్చిందని.. వాటి వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బును కాకుండా అభ్యర్థిని చూసి ఓట్లు వేయాలని ప్రజలకు భానుప్రకాశ్ రెడ్డి పిలుపు నిచ్చారు.