‘పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం’

by GSrikanth |   ( Updated:2024-06-29 15:50:07.0  )
‘పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం’
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పార్టీలో కలిసి వెళ్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అంతేగాక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం చూపలేవని తెలిపారు. కర్ణాటకలో బీజేపీకి ఏమాత్రం ఓట్ల శాతం తగ్గలేదని అన్నారు. కాగా, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం కాగా, 136 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది.

Read more:

బ్రేకింగ్: టీడీపీ, బీజేపీలతో పొత్తులపై పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

బీజేపీతో లాభమా.. నష్టమా ! టీడీపీ, జనసేనలో జోరుగా చర్చలు

బిగ్ న్యూస్: తెలంగాణలో జనసేన పొత్తు ఎవరితో.. సంచలనం రేపుతోన్న పవన్ తాజా ప్రకటన!

Advertisement

Next Story