వైసీపీలో చేరిన బీజేపీ నేత.. ఆమె పై సంచలన ఆరోపణలు

by Ramesh Goud |   ( Updated:2024-03-04 14:50:43.0  )
వైసీపీలో చేరిన బీజేపీ నేత.. ఆమె పై సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్ధులపై కసరత్తులు చేస్తున్న నేపధ్యంలో రాజకీయాల్లో జంపింగ్ ల పర్వం నడుస్తొంది. ఈ క్రమంలోనే సీఎం క్యాంపు కార్యాలయంలో ఆళ్ళగడ్డ బీజేపీ ఇన్ చార్జి భూమా కిషోర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నాయకులు వైసీపీలో చేరారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి సహా పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమా కిషోర్ మాట్లాడుతూ.. భూమా అఖిల ప్రియా ఓ క్రిమినల్ అని, ఆమె తన భర్తతో కలిసి కిడ్నాప్ లు, దొంగతనాలు, కబ్జాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే గంగుల నానిని గెలిపించడం కోసం భూమా కుటుంబం పని చేస్తుందని, భూమా అఖిల ప్రియా ఓటమి కోసం పని చేస్తానని చెప్పారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమం చూసి పార్టీలో చేరానని తెలిపారు. అలాగే ఏపీలో బీజేపీ నాయకులు టీడీపీ ఇచ్చే సీట్ల కోసం ఎదురు చూస్తున్నారే తప్ప నేతల, కార్యకర్తల మనోభావాలను పట్టించుకోవడం లేదని భూమా కిషోర్ అన్నారు.

Also Read..

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ ఎమ్మెల్యే

Advertisement

Next Story

Most Viewed