AP Elections 2024: ఈసీకి పురంధేశ్వరి లేఖ.. వాళ్లకు ఆ పని ఎలా అప్పగిస్తారని ఫైర్..

by Indraja |
AP Elections 2024: ఈసీకి పురంధేశ్వరి లేఖ.. వాళ్లకు ఆ పని ఎలా అప్పగిస్తారని ఫైర్..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఈసీ, సీఈఓకి లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్తే.. దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడంపై దగ్గుబాటి పురంధరేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ సిబ్బంది గతంలో ఎప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేదని.. అలాంటి వారికి ఇప్పుడు ఎన్నికల విధులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు.

అలానే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అనేక పండుగలు ఉన్నాయని.. వేసవి సెలవలు కనుక ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఆలయ సిబ్బంది లేకపోతే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. పై కారణాల దృష్ట్యా దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడంపై పునఃపరిశీలన చెయ్యాలని కోరుతూ పురంధరేశ్వరి ఈసీ, సీఈఓకి లేఖ రాశారు.

Advertisement

Next Story