- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయవాడ పశ్చిమలో తీవ్రమైన సమస్యలు.. చలించిపోయిన సుజనా చౌదరి
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు ఉండటంతో నియోజవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. కొండలను సైతం లెక్కచేయకుండా ప్రజలను కలుస్తున్నారు. దీంతో ఆయన ఎదుట ప్రజలు సమస్యల ఏకరువు పెడుతున్నారు. మంచినీరు, డ్రైనేజీ సమస్యలతో పడుతున్న బాధలను, రోడ్ల దుస్థితిని సుజనా చౌదరి దృష్టికి తీసుకెళుతున్నారు.
దీంతో స్థానికులు చెబుతున్న మాటలు విని సుజనా చౌదరి చలించిపోయారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి కూరగాయలు, పూల మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కరించేందుకు విజయవాడ పశ్చిమలో 22 డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతిభావంతులైన యువతీ, యువకులకు ఆయా రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రోత్సాహం కల్పిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.