- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెలాఖరుకు పొత్తులు ఫైనల్..రాజమండ్రిలో ఆ పార్టీకి భారీ షాక్...!
దిశ, వెబ్ డెస్క్: మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీని ఢీకొట్టేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ పొత్తులు, సీట్లు, పోటీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరుకు కల్లా పొత్తులు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. టీడీపీ, జనసేనతో బీజేపీ అధిష్టానం చర్చలు జరుపుతోందని తెలిపారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తాను రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని సోము వీర్రాజు పేర్కొన్నారు.
దీంతో రాజమండ్రి టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఆమె గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఈ సీటును బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. 2014లో కూడా ఈ సీటను బీజేపీకి కేటాయించారు. ఇక్కడ నుంచి ఆకుల సత్యనారాయణ పొందారు. అయితే మళ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమండ్రి సిటీలో పోటీ చేసేందుకు సుముఖుత చూపుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర అధిష్టానానికి సైతం చెప్పారట. అటు రాష్ట్ర బీజేపీ నేతలు పంపిన ప్రతిపాదనల్లో రాజమండ్రి సీటు అంశం కూడా ఉందని తెలుస్తోందిజ. మరి పొత్తుల్లో భాగంగా రాజమండ్రి సిటీ బీజేపీకి వెళ్తే ఇక్కడ బలంగా ఉన్న టీడీపీకి భారీ షాక్ తగిలినట్లవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.