- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap News: ఏపీలో మత మార్పిడిలు.. సోము వీర్రాజు ఆగ్రహం

దిశ, డైనమిక్ బ్యూరో: హిందూ దేవాలయాల భూములు, కానుకలను వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. హైందవ సంస్కృతి బలోపేతానికి అర కొర నిధులతో చేతులు దులుపుకునే ఈ ప్రభుత్వం, నేరుగా మతమార్పిడికి వీలుగా బాప్తీస్మం ఘాట్ల నిర్మాణం చేపట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాదా మత మార్పిడికి జగన్ ప్రభుత్వ ప్రోత్సాహం అనడానికి నిదర్శనం అని సోము వీర్రాజు మండిపడ్డారు.
హిందూ దేవాలయాల భూములు,కానుకలు ఇష్టానుసారం ఖర్చు చేస్తూ హైందవ సంస్కృతి బలోపేతానికి అర కొర నిధులతో చేతులు దులుపుకునే ఈ ప్రభుత్వం , నేరుగా మతమార్పిడికి వీలుగా బాప్తీస్మం ఘాట్ల నిర్మాణం చేపట్టడం దేనికి సంకేతం?
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 2, 2023
ఇది కాదా మత మార్పిడికి @ysjagan ప్రభుత్వ ప్రోత్సాహం అనడానికి నిదర్శనం. pic.twitter.com/V4tg7KcHJp