- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దువ్వాడ వాణికి బిగ్ షాక్.. మాధురి పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిన శ్రీనివాస్
దిశ, వెబ్ డెస్క్: దువ్వాడ ఇంటి వివాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇల్లు దివ్వెల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. అంతేకాదు ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ మేరకు దివ్వెల మాధురి ఆ ఇంట్లోనే ఉంటున్నారు. బాల్కనీపై అటు తిరుగుతున్నారు. దీంతో దువ్వాడ వాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తెతో కలిసి ఆ ఇంటి వద్ద నిరసనకు దిగారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్లొచ్చని టెక్కలి కోర్టు అనుమతించింది. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి వాణి ఆ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ అక్కడి నుంచి వెళ్లమని వాణి కుటుంబం బైఠాయించింది. దీంతో దువ్వాడ వివాదం మళ్లీ రచ్చకెక్కింది.
అయితే దివ్వెల మాధురి మాత్రం ఆ ఇల్లు తనదేనని చెబుతున్నారు. తనకు దువ్వాడ శ్రీనివాస్ రూ. 2 కోట్లు ఇవ్వాలని అందువల్ల అక్కవరం ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె తెలిపారు. తన ఇంటి వద్ద దువ్వాడ వాణి అల్లరి చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇంటికి కరెంట్ సైతం నిలిపించారని ఆరోపించారు. ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ పని చేయకుండా పవర్ కట్ చేయించారని దువ్వాడ మాధురి వ్యాఖ్యానించారు.