వంగవీటి రాధాకు చంద్రబాబుకు BIG షాక్.. వేరొకరికి టికెట్ కేటాయింపు

by GSrikanth |
వంగవీటి రాధాకు చంద్రబాబుకు BIG షాక్.. వేరొకరికి టికెట్ కేటాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత వంగవీటి రాధాకు టీడీపీ అధిష్టానం అనూహ్య షాకిచ్చింది. రాధా ఆశించిన విజయవాడ సెంట్రల్ టికెట్‌ను బోండా ఉమకు చంద్రబాబు ఖరారు చేశారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న రాధాకు ఈ సారి కూడా పార్టీ షాకివ్వడంతో ఆయన అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. కాగా, విజయవాడ నగరంలోని మూడు స్థానాల్లో రెండింట టీడీపీ తమ అభ్యర్దులను ఖరారు చేసింది. తూర్పు నుంచి గద్దే రామ్మోహన్, సెంట్రల్ నుంచి బోండా ఉమా పేర్లు ఖరారయ్యాయి. పశ్చిమం సీటు కోసం టీడీపీ, జనసేన మధ్య పోటీ నెలకొంది. ఈ జాబితాలో వంగవీటి రాధాకు సీటు కేటాయించకపోవడంతో రెండో జాబితాలో అయినా న్యాయం చేయాలని రాధా అభిమానులు డిమండ్ చేస్తున్నారు.

చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమం సీటు పెండింగ్‌లో ఉన్నా.. అక్కడ బీసీ లేదా మైనార్టీకి సీటు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో, అక్కడ రాధాకు ఛాన్స్ లేనట్లే. అయితే, తాజాగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై రాధా స్పందించలేదు. కానీ, ఆయన అనుచరగణం మాత్రం రాధా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed