- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ముందు వరుస చేరికలతో మంచి ఊపు మీద ఉన్న టీడీపీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. నూజివీడు టీడీపీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే అయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ముద్దరబోయిన సోమవారం సాయంత్రం తాడేపల్లికి చేరుకుని.. వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశమయ్యారు.
ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేసిన పెనమలూరు ఎమ్మెల్యే.. పార్థసారథికి చంద్రబాబు నాయుడు నూజివీడు టికెట్ ఖరారు చేయడంతో.. తనకు అన్యాయం జరిగిందటూ.. ముద్దరబోయిన గత రెండురోజుల నుంచి వరుస ప్రెస్ మీట్ లు పెడుతూ.. కన్నీరు పెట్టుకున్నారు. పార్టీ కోసం ఇంత కాలం పనిచేసిన తనను కాదని వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి నూజివీడు టికెట్ ఖరారు చేయడంతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే.. వరుస చేరికలతో ఊపు మీద ఉన్న టీడీపీకి భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది.