BREAKING: డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. AP హైకోర్టు కీలక ఆదేశం

by Satheesh |
BREAKING: డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. AP హైకోర్టు కీలక ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. గతంలో పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో కేసు నమోదు అయ్యింది. దీంతో ఈ కేసును సవాల్ చేస్తూ జనసేనాని హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణపై స్టే విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ స్టే కొనసాగుతోందని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. కాగా, గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలుమార్లు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ జగన్ సొంత సైన్యంలా మారిందని.. ఆ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలంటూ జనసేనాని హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు అయ్యింది.

Advertisement

Next Story